చంద్రబాబుపై ఎఫ్‌ఐఆర్.. కొన్ని షాకింగ్ విషయాలు !

తెదేపా అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అమరావతి అసైన్డ్ భూముల కొనుగోలు వ్యవహారంలో బాబుకు నోటీసులు అందజేశారు. ఈ నెల 23న విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు. చంద్రబాబుపై నమోదైన ఎఫ్ఆర్ఐ ని పోలీసులు విడుదల చేశారు. ఇందులో అక్రమాలు జరిగాయని ప్రభుత్వం గుర్తించి కేసు నమోదు చేయలేదు. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు పై కేసు నమోదు చేసినట్లుగా ఉంది. 


ఫిబ్రవరి 24న మంగళగిరిలోని సీఐడీ పోలీస్ స్టేషన్‌లో ఆళ్ల రామకృష్ణారెడ్డి టైప్ చేసుకు వచ్చిన మ్యాటర్‌తో ఫిర్యాదు చేశారని.. దానిపై కేసు నమోదు చేసుకుని ప్రాథమిక దర్యాప్తు జరిపామని పోలీసులు అందులో తెలిపారు. కొంత మంది రైతుల వద్ద కొంత మంది కొంత మంది పలుకుబడి గల వ్యక్తులు తమ పలుకుబడి ఉపయోగించి.. బెదిరించి భూములు కొనుగోలు చేశారు. అమ్మకపోతే ఎలాంటి పరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని మధ్యవర్తులు బెదిరించడంతో వారంతా అమ్ముకున్నారని పోలీసులు ఎఫ్‌ఆర్‌లో పేర్కొన్నారు. ఈ మొత్తం ఫిర్యాదులో అసైన్డ్ ల్యాండ్స్ అమ్ముకున్న రైతుల పేర్లు లేవు. కొనుగోలు చేసిన వారి పేర్లు లేవు. బాధితులు ఎవరూ ఫిర్యాదు చేసినట్లుగా లేదు. అంతేకాదు.. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ కేసు కూడా నమోదు చేశారు.