ఏపీ ‘పదో తరగతి పరీక్షల షెడ్యూల్’ విడుదల
ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మంత్రి ఆదిమూలపు సురేష్ పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశారు. జూన్ 7 నుంచి 16వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నట్లు ప్రకటించారు. మే 5 నుంచి 23వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. జూలై 21వ తేదీ నుంచి ఏపీలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుందని మంత్రి తెలిపారు.
పదో తరగతి పరీక్షల షెడ్యూల్ :
- జూన్ 7 : ఫస్ట్ లాంగ్వేజ్
- జూన్ 8 : సెకండ్ లాంగ్వేజ్
- జూన్ 9 : ఇంగ్లీష్
- జూన్ 10 : గణితం
- జూన్ 11 : ఫిజికల్ సైన్స్
- జూన్ 12 : బయోలాజికల్ సైన్స్
- జూన్ 14 : సోషల్ స్టడీస్
గతంలో 11 పేపర్లు ఉండగా.. కరోనా విజృంభణ నేపథ్యంలో ఈ యేడాది 7 పేపర్లుగా కుదించారు. సెలబస్ ని కూడా బాగా తగ్గించినట్టు ఇప్పటికే విద్యాశాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే.