నిజామాబాద్ లో పసుపు బోర్డ్ అవసరం లేదు : కేంద్రం

తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేసే ఉద్దేశం లేదని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ నిన్న రాజ్యసభలో తెలిపిన విషయం తెలిసిందే.  నిజామాబాద్‌లో ప్రత్యేకంగా పసుపు బోర్డు పెట్టాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ఇవాళ స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పురుషోత్తం రూపాలా సమాధానమిచ్చారు.

పసుపు బోర్డు ఏర్పాటుపై కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు రూపాలా సమాధానం ఇచ్చారు. పసుపు బోర్డు చేయాల్సిన పని సుగంధ ద్రవ్యాల బోర్డు చేస్తుందని.. మరొకటి అవసరం లేదన్నారు. సుగంధ ద్రవ్యాల బోర్డుతో అవే లాభాలు కలుగుతున్నప్పుడు మరో బోర్డు ఎందుకని ప్రశ్నించారు.