భాజాపా ఎంపీ రామ్‌స్వరూప్ శర్మ ఆత్మహత్య
భాజపా ఎంపీ రామ్‌స్వరూప్ శర్మ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఆయన నివాసంలో ఫ్యాన్ కు ఉరి వేసుకొని మృతి చెందారు. ఆర్‌ఎంఎల్ ఆసుపత్రి సమీపంలోని గోమతి ఆపార్ట్‌మెంట్‌లో శర్మ నివాసముంటున్నారు. బుధవారం ఉదయం ఆయన ఎంతకీ గది తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చిన శర్మ సిబ్బంది ఒకరు పోలీసులకు ఫోన్ చేశారు. ఫ్లాట్‌కు వెళ్లిన పోలీసులు గది తలుపు బద్దలుకొట్టగా.. ఎంపీ ఫ్యాన్స్‌కు వేలాడుతూ కన్పించారు. ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటారని అనుమానిస్తున్నారు.
62 ఏళ్ల శర్మ హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి జిల్లాలో జన్మించారు. ఇదే లోక్‌సభ నియోజకవర్గం నుంచి 2014, 2019 ఎన్నికల్లో రెండు సార్లు ఎంపీగా గెలిచారు. శర్మకు భార్య, ముగ్గురు కుమారులున్నారు. ఎంపీ మరణంతో నేడు జరగాల్సిన భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని రద్దు చేశారు