‘వకీల్ సాబ్’ మూడో పాట వచ్చేసింది

‘వకీల్‌ సాబ్‌’ చిత్రంలోని మూడో పాట వచ్చేసింది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న చిత్రమిది. తి హాసన్‌, అంజలి, నివేదా థామస్‌, అనన్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ హిట్ పింక్ కి రిమేక్ ఇది. బోనీ కపూర్ తో కలిసి దిల్ రాజు నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ సినిమాలోని ‘కంటిపాపా కంటిపాపా’ అనే మెలోడీని విడుదల చేసింది చిత్ర బృందం. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ గీతాన్ని అర్మాన్‌ మాలిక్‌, దీపు, తమన్‌ ఆలపించారు. తమన్‌ సంగీతం అందించారు. వకీల్ సాబ్ నుంచి వచ్చిన ప్రేమగీతం ఇది. పవన్-శృతిహాసన్ లపై చిత్రీకరించారు. ఈ పాటలో పవన్ యంగ్ గా కనిపిస్తున్నారు. ఈ పాటని పాడిన సింగర్స్ కూడా ఈ సాంగ్ లో సందడి చేశారు. 
వకీల్ సాబ్ నుంచి ఇప్పటికే విడుదలైన ‘మగువా మగువా’, ‘సత్యమేవ జయతే’ పాటలు, టీజర్‌ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. తాజాగా విడుదలైన మూడో పాట అంచనాలని మరింతగా పెంచేలా ఉంది. అల… వైకుంఠపురంలోని పాటల మాదిరిగా కంటిపాపా రికార్డ్ వ్యూస్, లైక్స్ సొంతం చేసుకొనే ఉంది. ఏప్రిల్‌ 9న వకీల్ సాబ్  ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.