ఒక్కరోజులోనే 35,871 కరోనా కేసులు

దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 35,871 కరోనా కేసులు నమోదయ్యాయ్. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,14,74,605 కి చేరింది. కొత్తగా 17,741 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1,10,63,025కు చేరింది. రికవరీ రేటు 96.65శాతం నుంచి 96.56శాతానికి తగ్గింది.
గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 172మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మహమ్మారి వెలుగులోకి వచ్చిన నాటి నుంచి దేశవ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,59,216కి చేరింది. ఇక మరణాల రేటు 1.39 శాతంగానే కొనసాగుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 2,52,364 కి పెరిగింది.


ఇక తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 278 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 3,02,047కి చేరింది. నిన్న కొవిడ్‌తో ముగ్గురు మృతిచెందారు. దీంతో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 1662కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 111 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2,98,120కి చేరింది.

దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో మరోసారి లాక్ డౌన్ తప్పదేమో అనే చర్చ జరుగుతోంది. అయితే నిన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడిన ప్రధాని మోడీ.. ఎక్కడికక్కడ మైక్రో లాక్ డౌన్ లు విధించి కరోనాని కట్టడి చేయాలని సూచించారు. దీంతో మరోసారి దేశంలో లాక్ డౌన్  విధించే అవకాశాల్లేవని ప్రధాని క్లారిటీ ఇచ్చినట్టయింది.