ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేలా తెలంగాణ బడ్జెట్

ఈరోజు తెలంగాణ బడ్జెట్ డే. మరికాసేపట్లో ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు శాసన సభలో బడ్జెట్ ని ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీకి వెళ్లేముందు మంత్రి హరీశ్‌రావు జూబ్లీహిల్స్‌లోని వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వరస్వామి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరుగుతుందన్నారు. 


ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచనలకు అనుగుణంగా బడ్జెట్‌ ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేలా బడ్జెట్ రూపకల్పన చేశామని తెలిపారు. కేసీఆర్ సర్కారు హామీలకు మాత్రమే పరితం అవుతుంది. వాటి అమలు మాత్రం జరగడం లేదనే విమర్శలున్నాయ్. ఆ విమర్శలకు సమాధానం ఇచ్చేలా తాజా బడ్జెట్ ఉండబోతుందని సమాచారమ్. తాజా బడ్జెట్ లో నిరుద్యోగ భృతి బడ్జెట్ కేటాయిస్తారా ? అన్నది ఆసక్తిగా మారింది.