రూ. 2,30, 825, 96 కోట్లతో TS బడ్జెట్

తెలంగాణ శాసనసభలో 2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ.. మంత్రి హరీష్ రావు బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. మొత్తం రూ. 2,30, 825, 96 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా.. ఇందులో రెవెన్యూ వ్యయం రూ. 1, 69, 383.44 కోట్లు..  క్యాపిటల్ వ్యయం రూ. 29, 046.77 కోట్లు.. రెవెన్యూ మిగులు రూ. 6, 743.50 కోట్లు.. ఆర్థిక లోటు రూ. 45, 509.60 కోట్లుగా ఉంది.  ఆర్థిక శాఖ మంత్రిగా హరీష్‌ శాసనసభలో బడ్జెట్ ని ప్రవేశపెట్టడం ఇది రెండోసారి.


తాజా బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేశారు. దాదాపు రూ. 25వేల కోట్లు కేటాయించింది. రైతు బంధు కోసం రూ. 14, 800 కోట్లు కేటాయించగా.. రైతు రుణమాఫీ కోసం రూ. 5, 225కోట్లు..  రైతు బీమా కోసం రూ. 1200 కోట్లు కేటాయించింది. పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.29,271 కోట్లు,  సాగునీటి రంగానికి రూ.16,931 కోట్లు, ఆసరా పింఛన్లకు రూ.11,728 కోట్లు, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ పథకాలకు రూ.2,750 కోట్లు, రీజనల్‌ రింగ్‌రోడ్డు భూ సేకరణకు రూ.750 కోట్లు.. నూతన సచివాలయం నిర్మాణానికి రూ.610 కోట్లు, పశు సంవర్ధక, మత్స్య శాఖకు 1730 కోట్లు, దేవాదాయశాఖకు రూ.720 కోట్లు, అటవీ శాఖకు రూ.1,276 కోట్లు, ఆర్టీసీకి రూ.1500 కోట్లు కేటాయించారు.