మూడో రౌండ్’లోనూ పల్లాదే ఆధిక్యం

నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మూడో రౌండ్ లోనూ సిట్టింగ్‌ ఎమ్మెల్సీ, తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆధిక్యంలో నిలిచారు. మూడో రౌండ్ ముగిసే సరికి పల్లా కు మొత్తం 47,545 ఓట్లు వచ్చాయి. ఆయన తరువాత స్థానంలో తీన్మార్ మల్లన్న 34,864 ఉన్నారు. మూడో స్థానంలో కోదండరామ్ 29,560, నాల్గో స్థానంలో ప్రేమిందర్ రెడ్డి 19,899 ఉన్నారు.

ప్రస్తుతం పల్లా 12వేల పై చిలుకు ఓట్ల మెజారిటీలో ఉన్నారు.
మూడు రౌండ్ లో తీన్మార్ మల్లన్న కంటే ప్రొఫెసర్ కోదండ రామ్ కు ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో 2వ ప్రాధాన్యత ఓట్లు కీలకంగా మారనున్నాయ్. పల్లా రాజేశ్వర్ రెడ్డి-తీన్మార్ మల్లన్న, కోదండరామ్ ల మధ్య త్రిముఖ పోటీ ఉండనుంది. అయితే 2వ ప్రాధాన్యత ఓట్లు కోదండ రామ్ కు అధికంగా పడ్డాయనే టాక్ వినిపిస్తోంది. రేపు ఉదయం కల్లా ఫలితం త్రావొచ్చని చెబుతున్నారు.

మరోవైపు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి తెరాస(17,439) -బీజేపీ (16,385)ల మధ్య తగ్గా పోరు నడుస్తోంది. వీరిద్దరి మధ్య కేవలం వెయ్యి ఓట్ల తేడా మాత్రమే కనిపిస్తోంది. మూడో స్థానంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు (8,357) కొనసాగుతున్నారు.