కోహ్లీ సేన గెలిచింది.. నిలిచింది !

తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో కోహ్లీ సేన అదరగొట్టింది. నాల్గో టీ20లో ఇంగ్లండ్ ని చిత్తు చేసింది. టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. టీమిడియా బ్యాటింగ్ లో సూర్యకుమార్‌ యాదవ్‌ (57; 31 బంతుల్లో 6×4, 3×6) ఆటే హైలైట్‌. విధ్వంసకరమైన షాట్లతో విరుచుకుపడ్డాడు. అతడు ఆడిన రెండో మ్యాచ్ ఇది. శ్రేయస్‌ అయ్యర్‌ (37; 18 బంతుల్లో 5×4, 1×6), రిషభ్ పంత్‌ (30; 23 బంతుల్లో 4×4) రాణించారు.


186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 177/8కి పరిమితం అయింది.  ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ (40; 27 బంతుల్లో 6×4, 1×6), జానీ బెయిర్‌ స్టో (25; 19 బంతుల్లో 2×4, 1×6), బెన్‌ స్టోక్స్‌ (46; 23 బంతుల్లో 4×4, 2×6)ను రాణించారు. ఆఖరి ఓవర్ లో ఇంగ్లండ్ కు 23 పరుగులు అవసరం కాగా.. ఆర్చర్ గెలిపించినంత పని చేశాడు. సిక్స్, ఫోర్ తో చెమటలు పట్టించాడు. దానికి తోడు శార్థుల్ ఠాకూర్ లయ తప్పి వరుసగా రెండు వైడ్స్ వేయడంతో భారత్ అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఫైనల్ గా టీమిండియా గెలిచేసింది. దీంతో 5 మ్యాచ్ ల సిరీస్ 2-2 సమం చేసి టైటిల్ పోరులో నిలిచింది.