సూర్య కుమార్ ఔట్‌పై అభిమానుల అసంతృప్తి
ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టీ20లో సూర్యకుమార్ యాదవ్ (57; 31 బంతుల్లో 6×4, 3×6) అద్భుతమైన ఆటతో ఆకట్టుకున్నాడు. అతడు ఆడిన రెండో మ్యాచ్ ఇది. ఈ సిరీస్ లో తొలిమ్యాచ్ లో సూర్య ఆడినా.. అతడి బ్యాటింగ్ చేసే అవకాశరం లేదు. తొలిసారి వచ్చిన అవకాశాన్ని సూర్య సద్వినియోగం చేసుకున్నాడు. ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. 31 బంతుల్లోనే 57 పరుగులు చేశాడు. అయితే అతడు ఔట్ తీరుపై అభిమానులు, టీమ్‌ఇండియా మాజీలు వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
టీమ్‌ఇండియా ఇన్నింగ్స్ 13.2 ఓవర్‌కు సామకరన్ వేసిన బంతిని సూర్యకుమార్ షాట్ ఆడగా, ఆ బంతి నేలకు తాకుతున్న వేళ మలన్ క్యాచ్ అందుకున్నాడు. దాంతో అది వివాదాస్పదమైంది. బంతి స్పష్టంగా మలన్ చేతిలో పడిందో లేదో తెలుసుకోకుండానే ఆన్‌ఫీల్డ్ అంపైర్ ఔటిచ్చాడు. అది రీప్లేలో నేలకు తాకుతున్నట్లు కనిపించడంతో థర్డ్ అంపైర్ దృష్టికి వెళ్లింది. దాన్ని అనుమానాస్పదంగా భావించిన థర్డ్ అంపైర్.. అంపైర్స్‌కాల్‌గా ఔటిచ్చారు. దీనిపై అటు టీమ్‌ఇండియాతో పాటు ఇటు మాజీలు, నెటిజెన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ మ్యాచ్‌లో సూర్య ఔటైనా టీమ్‌ఇండియా 185/8 స్కోర్ సాధించింది. అనంతరం ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 177/8తో సరిపెట్టుకుంది. దీంతో సిరీస్ ప్రస్తుతం 2-2తో సమంగా నిలిచింది. శనివారం ఆఖరిదైన ఐదో టీ20 మ్యాచ్ జరగనుంది.