శేఖర్ కమ్ములని కలిసిన తమన్నా.. హ్యాపీ డేస్ 2 రాబోతుందా ?
మిల్కీ బ్యూటీ తమన్నాని మొదట హ్యాపీ చేసింది దర్శకుడు శేఖర్ కమ్ములనే. హ్యాపీ డేస్ తర్వాతే తమన్నా దశ తిరిగింది. స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. దాదాపు దశాబ్ధ కాలంగా టాలీవుడ్ ని ఏలుతోంది. కోలీవుడ్ లోనూ సినిమాలు చేస్తోంది. బాలీవుడ్ కి వెళ్లొచ్చింది. ప్రస్తుతం తెలుగు సినిమాలతో బిజీగా గడుపుతోంది.
భారీ బడ్జెట్ చిత్రాలకు కెరాఫ్ అడ్రస్ గా మారింది. బాహుబలి, సైరా సినిమాల్లో కీలక పాత్రల్లో నటించింది. అప్పుడప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో ఐటమ్ సాంగ్ లలో మెరుస్తోంది. ఇలాంటి టైమ్ లో తమన్నా దర్శకుడు శేఖర్ కమ్ములని కలిసింది. వీరిద్దరు కలిసి హ్యాపీగా ఫోటోలకు పోజులిచ్చారు. వాటిని తమన్నా సోషల్ మీడియాలో షేర్ చేసింది.
వీటిని చూసిన నెటిజన్స్ హ్యాపీ డేస్ 2 రాబోతుందా ? అని అడుగుతున్నారు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొస్తోంది. ఈ నేపథ్యంలో శేఖర్ కమ్ముల తన తదుపరి సినిమాపై ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే తమన్నాని పిలిపించుకున్నారనే ప్రచారం కూడా మొదలైంది. అదే నిజమైతే.. తమన్నా ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల ఓ ప్రయోగాత్మక సినిమా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా ? అనే అనుమానలు కలుగుతున్నాయ్. దీనిపై మరికొన్ని రోజుల్లో క్లారిటీ రావొచ్చేమో.. !