అజ్ఝాతవాసి మహేష్’ని భయపెడుతున్నాడు

సూపర్ స్టార్ మహేష్ బాబు ‘భరత్ అను నేను’ హిట్ కిక్కులో ఉన్నాడు. ఈ విజయాన్ని ఫ్యామిలీతో కలిసి స్పెషన్ లో ఎంజాయ్ చేస్తున్నాడు మహేష్. తిరిగొచ్చాక వంశీపైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న తన 25వ సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు. అశ్వినీదత్-దిల్ రాజులు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించనున్నారు.

ఇప్పుడీ సినిమా విషయంలో మహేష్’కు భయం పట్టుకొన్నట్టు ప్రచారం జరుగుతోంది. టాలీవుడ్ స్టార్ హీరోలకి 25వ సినిమా పెద్దగా కలిసిరాకపోవడమే దీనికి కారణం. త్రివిక్రమ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకొచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 25వ సినిమా ‘అజ్ఝాతవాసి’ అట్టర్ ప్లాపుగా నిలిచింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ 25వ సినిమా ‘నాన్నకు ప్రేమతో’ విషయంలోనూ కమర్షియల్ గా పెద్దగా వర్కవుట్ కాలేదని చెబుతుంటారు. ఈ ట్రాక్ రికార్డు మహేష్ ని భయపెడుతుందని చెప్పుకొంటున్నారు.

ఇక, మహేష్ 25వ సినిమా కోసం ‘రాజసం’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఆల్రెడీ గెడ్డెం లుక్ లో ఉన్న మహేష్ ‘రాజసం’ టైటిల్ పోస్టర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ పోస్టర్ ని చూసి ప్రిన్స్ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఇలాంటి టైంలో మహేష్ తన 25వ సినిమా విషయంలో భయపడిపోతున్నారంటూ వస్తున్న వార్తలని లైట్ తీసుకొంటున్నారు. ఇదంతా ఉత్తిత్తి ప్రచారమేనని కొట్టిపారేస్తున్నారు. అదీ.. నిజమే మరీ.. !