సూర్య వివాదాస్పద ఔట్‌పై కోహ్లీ ఆగ్రహం

 ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టీ20లో‌ సూర్యకుమార్‌ యాదవ్‌(57; 31 బంతుల్లో 6×4, 3×6) ఔటైన తీరు వివాదాస్పదమైంది.సామ్‌కరన్‌ వేసిన 14వ ఓవర్‌ రెండో బంతికి సూర్య ఆడిన షాట్‌ను డేవిడ్‌ మలన్‌ క్యాచ్‌ అందుకున్నాడు. అయితే, అదే సమయంలో బంతి నేలకు తాకినట్లు కనిపించినా ఫీల్డ్‌ అంపైర్‌ ఔటిచ్చాడు. విషయం థర్డ్‌ అంపైర్‌కు చేరడంతో రీప్లే చూసి దాన్ని అనుమానాస్పద ఔట్‌గా భావించి అంపైర్స్‌కాల్‌ ఆధారంగా ఔట్‌గా ప్రకటించాడు.


మ్యాచ్ అనంతరం దీనిపై మాట్లాడిన కెప్టెన్ కోహ్లీ ఆశ్చర్యంతో పాటు ఆగ్రహం వ్యక్తం చేశాడు. అస్పష్టంగా ఉన్నప్పటికీ ఫీల్డ్‌ అంపైర్‌ సాఫ్ట్‌ సిగ్నల్‌ ఔటివ్వడంపై కెప్టెన్‌ ఆశ్చర్యపోయాడు. ఇలాంటి నిర్ణయాలు వివాదాస్పదమౌతాయని కోహ్లీ అన్నాడు. ఇలాంటి వాటిని ఆటలో నుంచి తొలగించి ఉన్నతంగా తీర్చిదిద్దాలి. కీలకమైన మ్యాచ్‌ల్లో ఇలాంటివి సరికావు. మైదానంలో కచ్చితమైన స్పష్టత ఉండాలని మేం కోరుకుంటున్నాం’ అన్నారు.