ప్రివ్యూ : రాజుగాడు

సంజనారెడ్డి దర్శకత్వంలో రాజ్ తరుణ్ – అమైరా దస్తూర్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘రాజుగాడు’. ఈ శుక్రవారం (జూన్ 1)న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ఆఫీసర్’ నాగార్జునతో కలిసి బాక్సీఫీసు యుద్ధానికి దిగనున్నాడు. నాగ్ తో ఫైట్ కి దిగిన రాజ్ తరుణ్ ధైర్ఘ్యాన్ని ప్రేక్షకులు మెచ్చుకొంటున్నారు. అంత సాహాసం చేస్తున్నాడంటే ‘రాజుగాడి’లో దమ్ము ఉండివుంటుందని చెప్పుకొంటున్నారు. ఈ నేపథ్యంలో ‘రాజుగాడి’ సినిమా విశేషాలపై ఓ లుక్కేద్దాంపదండీ.. !

ప్రివ్యూ :

* ఈ మధ్య రాజ్ తరుణ్ సినిమాలు వరుసగా నిరాశపరిచాయి
* అంధగాడు, కిట్టు ఉన్నాడు జాగ్రత్త, రంగుల రాట్నం పెద్దగా సినిమాలు ఆడలేదు.
* ఇంకో విశేషం ఏమిటంటే రాజ్ తరుణ్ చివరి సినిమా ‘రంగుల రాట్నం’ని నిర్మాత నాగార్జున
* ఇప్పుడు ఏకంగా రాజుగాడు ఆఫీసర్ నాగార్జునని ఢీకొనడానికి రెడీ అయ్యాడు
* రాజుగాడు సినిమాలో రాజ్ తరుణ్ ఓ దొంగ
* ఆ దొంగ వేషాలతో కామెడీ పండిస్తాడట
* పూర్తి వినోదాత్మక చిత్రమిదని చెబుతున్నారు.

మొత్తానికి.. ఈవారం కామెడీ-యాక్షన్ సినిమాల మధ్య పోటీ నెలకొంది. మరీ పోటీలో యాక్షన్ గెలుస్తుందా ? కామేడీ హిట్ అవుతుందా ? అనేది చూడాలి.