రివ్యూ : చావు కబురు చల్లగా

చిత్రం : చావు కబురు చల్లగా (2021)


నటీనటులు : కార్తీకేయ, లావణ్య త్రిపాఠి, అనసూయ భరద్వాజ్, ఆమని, మురళీశర్మ తదితరులు

సంగీతం : జేక్స్ బిజోయ్

దర్శకత్వం : కౌశిక్ పెగళ్లపాటి

నిర్మాత : బన్నీ వాసు

రిలీజ్ డేటు : 19 మార్చి, 2021.

తొలి సినిమా ‘ఆర్ఎక్స్100’తో హిట్ కొట్టారు కార్తీకేయ. ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలన్నీ యావరేజ్ నిలిచాయ్. కార్తీకేయ తాజా చిత్రం ‘చావు కబరు చల్లగా’. ఈ చిత్రానికి కొత్త దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించారు. కార్తీకేయ జంటగా లావణ్య త్రిపాఠి నటించారు. ఇందులో బస్తీ బాలరాజు పాత్రలో కార్తీకేయ మాస్ పాత్రలో నటించారు. ప్రచార చిత్రాలతో సినిమాపై అంచనాలు పెంచేసిన.. చావు కబురు చల్లగా ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరీ.. ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకుంది ? తెలుసుకోవడానికి రివ్యూలోకి వెళదాం పదండీ.. !

కథ

బస్తీ బాలరాజు ( కార్తీకేయ గుమ్మకొండ) శవాలను మోసుకెళ్తే వాహనం డైవర్. ఏ బాధ్యత లేకుండా జీవించేస్తుంటాడు. ఓ చావులో భార్తను కోల్పోయిన మల్లిక (లావణ్య త్రిపాఠి)ను తొలి చూపులోనే ప్రేమిస్తాడు. మల్లికతోపాటు కుటుంబ సభ్యులు నిరాకరించినా బాలరాజు వెంటపడుతూనే ఉంటాడు. ఫైనల్ గా బాలరాజు ప్రేమని మల్లిక ఒప్పుకుందా ? తల్లి అక్రమ సంబంధం గురించి తెలిసి బాలరాజు ఎలా రియాక్ట్ అన్నది మిగితా కథ.

సినిమాలోని హైలైట్స్ :

పుట్టుక, చావు లాంటి భాగోద్వేగమైన పాయింట్ ని దర్శకుడు ఎంచుకున్నాడు. ప్రజల ఆమోదం పొందని, సెంటిమెంట్లకు దూరంగా ఉండే పాయింట్లను తీసుకొని బాలెన్స్‌గా కథను నడిపించిన తీరును అభినందించాలి. జీవితం పట్ల ఉండే ఫిలాసఫీని తనదైన శైలిలో చెప్పడానికి చేసిన ప్రయత్నం బాగుంది. కథలో ఉండే వివాదాస్పద పాయింట్లను డీల్ చేసిన విధానం పర్‌ఫెక్ట్‌గా ఉంది. అయితే ఫస్టాప్ హీరో క్యారెక్టర్ ని ఎస్టాబ్లీష్ చేయడానికే ఎక్కువ సమయం తీసుకున్నాడు. 

రెండో భాగంలో మాత్రం దర్శకుడి ప్రతిభ కనబడింది. తల్లి అక్రమసంబంధం గురించి తెలిసిన బాలరాజు రియాక్షన్. తల్లితో ముడిపడి ఉన్న ఓ భావోద్వేగమైన అంశాన్ని జోడించి కథను మరింత ఎమోషనల్‌గా మార్చడంతో సెకండాఫ్‌పై ఆసక్తి పెరుగుతుంది. అయితే సెకాంఢాఫ్ ని ఎమోషనల్ గా బాగా డీల్ చేశాడు దర్శకుడు. మొత్తంగా కామెడీ, ఎమోషనల్ కొత్త వరకు వర్కవుట్ అయింది.

బస్తీ బాలరాజు పాత్రలో కార్తీకేయ బాగా నటించారు. ఎమోషనల్ సీన్స్ లో బాగా చేశాడు. సినిమాని తన భుజాలపై మోశాడు. ఇక హీరోయిన్ లావణ్య త్రిపాఠి తొలి సారి డిగ్లామర్ పాత్రలో నటించింది. బ్యాలెన్స్ గా నటించింది. ఆమని, మిగితా నటీనటులు తమతమ పరిధి మేరకు నటించారు.

సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్ అందించిన పాటలు క్లాస్ మాస్ అంశాలతోపాటు, భావోద్వేగంగా సాగుతాయి. రీరికార్డింగ్ కొన్ని సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. కామ్ చావ్లా సినిమాటోగ్రఫి బాగుంది. సత్య ఎడిటింగ్, జీఎం శేఖర్ ఆర్ట్ విభాగం పనితీరు ఫర్వాలేదనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయ్.

ప్లస్ పాయింట్స్ :

  • కార్తీకేయ, లావణ్య, ఆమనిల నటన
  • సెకాంఢాఫ్
  • ఎమోషనల్ సీన్స్
    మైనస్ పాయింట్స్ :
  • ఫస్టాఫ్
  • స్లో నేరేషన్
    ఫైనల్ గా : చావు కబురు చల్లగా – ఓసారి చూడొచ్చు
    రేటింగ్ : 2.5/5