బిగ్ బాస్ 2 పార్టిసిపెంట్స్ లిస్టు.. షాక్ కావాల్సిందే !
తెలుగు బిగ్ బాస్ సీజన్ – 2కి కౌంట్‌డౌన్ మొదలైంది. జూన్ 10న బిగ్ బాస్ 2 మొదలవ్వబోతుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన తెలుగు బిగ్ బాస్ సీజన్-1 సూపర్ హిట్టయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ సీజన్ 2 కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఐతే, సీజన్ 2కి నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడు. ప్రోమోలో ఈసారి కొంచె మసాలా.. అంటూ నాని ఉడికిస్తున్నాడు.
నాని చెప్పింది నిజమే. ఐతే, మసాలా కొంచెం కాదు. ఈసారి మసాలా ఓ రేంజ్ లో ఉండబోతుంది. సీజన్ 2 లో పార్టిసిపెంట్స్ లిస్టుని చూస్తే ఇది అర్థమవుతోంది. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 2లో పాల్గొనబోయే కొందరి పార్టిసిపెంట్స్ పేర్లు బయటికొచ్చాయి. ఇప్పుడు మరిన్నీ పేర్లు లీకయ్యాయి. సంచలన నటీనటులు బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టనున్నారు. దీంతో.. మసాలా మాములుగా ఉండదనే విషయం అర్థమవుతోంది.
లీకైన బిగ్ బాస్ సీజన్ 2 పార్టిసిపెంట్స్ లిస్టులో సింగర్ గీతామాధురి, హీరో తరుణ్, హీరోయిన్ ఛార్మి, యాంకర్ శ్యామల, వరుణ్ సందేశ్, ఆర్యన్ రాజేష్, ధన్య బాలకృష్ణ, యాంకర్ లాస్య, నటి శ్రీదేవి, నటి గజాల, సీనియర్ హీరోయిన్ రాశి, చాందిని చౌదరి, శ్రీ రెడ్డి పేర్లు ఉన్నాయి. వీరిలో ఎక్కువ మంది ఏదో టైంలో ఇండస్ట్రీని షేక్ చేసే వార్తల్లో నిలిచినవారే. ఇలాంటి వారు బిగ్ బాస్ ఇంట్లో ఉంటే.. మసాలా కాకుంటే ఇంకేముంటుంది.. !!