బుమ్రా పెళ్లి ఫోటోలపై నెటిజన్స్ ఆగ్రహం
టీమ్‌ఇండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. ఈనెల 15న ఓ క్రీడా ఛానల్ వ్యాఖ్యాత సంజన గణేశన్‌ను వివాహం చేసుకున్నాడు. కేవలం కుటుంబ వేడుకగా గోవాలో ఈ వేడుక జరిగింది. ఏడడుగులు వేసే వరకూ ఈ విషయాన్ని పూర్తి గోప్యంగా ఉంచిన బుమ్రా తర్వాత పెళ్లికి సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నాడు. ఈ క్రమంలోనే సంజనతో కలిసి వివాహ వేడుక సమయంలో తీసుకున్న ఫొటోలను పంచుకున్నాడు.
వీటిని చూసిన నెటిజన్స్ బుమ్రాపై సటైర్స్ వేస్తున్నారు. ఇతరలకు చెప్పే ముందు ముందు మనం పాటించాలని చురలకు అంటిస్తున్నారు. ఇంతకు విషయం ఏంటంటే ? బుమ్రా షేర్ చేసిన ఫోటోల్లో బాణసంచా కాల్చడం కనిపించడంతో నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే బుమ్రా గతంలో ఓసారి దీపావళి రోజున టపాసులు కాల్చొద్దని అభిమానులను కోరుతూ ట్వీట్ చేశాడు. ఇప్పుడా.. ఆ విషయం గుర్తి చేసి మరీ.. బుమ్రాకు గట్టిగా వేసేస్తున్నారు.