కేటీఆర్’ని కలిసిన గంటా.. ఏంటీ బిజినెస్ ?
తెదేపా ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు ఇవాళ అసెంబ్లీ ఆవరణలో తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను కలిశారు. దీంతో వీరి భేటీ వెనకున్న రాజకీయాలు ఏంటీ ? అనే చర్చ మొదలైంది. అయితే గంటా కేటీఆర్ ని విశాఖకు ఆహ్వానించారు. విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతుగా విశాఖపట్నం రావాలని కేటీఆర్ ని ఆహ్వానించారు.
ఇప్పటికే మంత్రి కేటీఆర్ విశాఖ ఉక్కు ఆందోళనకి మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. ఇవాళ విశాఖ ఉక్కు పరిశ్రమని ప్రయివేటీకరణ చేస్తున్న కేంద్రం.. రేపటి రోజున తెలంగాణకు రావొచ్చు. మన బీహెచ్ ఈఎల్ తదితర పరిశ్రమలని ప్రయివేటీకరణ చేసే అవకాశాలున్నాయ్. అందుకే ప్రయివేటీకరణని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఇక గంటా ఆహ్వానంపై స్పందించిన కేటీఆర్ విశాఖ పర్యటనపై త్వరలో నిర్ణయం తీసుకుంటానన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు, ఉద్యోగ సంఘాల ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. విశాఖ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మిగితా ఎమ్మెల్యేలు కూడా రాజనామా చేసి.. ఉద్యమానికి సపోర్ట్ చేయాలని ఆయన కోరుతున్నారు.