పోలీస్’కు క్లాస్ పీకిన సామాన్యుడు
రూల్ ఈజ్ రూల్. రూల్ ఫర్ ఆల్. కానీ రూల్స్ తమకు పట్టనట్టు కొందరు పోలీసులు వ్యవహరించడంపై ఓ సామాన్యుడు ఫైర్ అయ్యాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో హెల్మెట్ పెట్టుకోని వారికి పోలీసులు జరిమానాలు విధిస్తున్నారు. అయితే పోలీసులు ద్విచక్రవాహనాలపై హెల్మెట్ ధరించకుండా వచ్చిన విషయాన్ని గమనించిన ఓ యువకుడు ఇదేంటని ప్రశ్నించాడు.
మీకు హెల్మెట్ పెట్టుకునే బాధ్యత లేదా ? అంటూ నిలదీశాడు. తన సెల్‌ఫోన్‌లో వీడియో తీస్తూ ఎందుకు హెల్మెట్ పెట్టుకోలేదని, మీరే నిబంధనలు పాటించనప్పుడు మాకెలా జరిమానాలు విధిస్తారని మండిపడ్డాడు. అర్జెంట్ గా ఫోన్ కాల్ వస్తే హెల్మెట్ లేకుండా రావాల్సి వచ్చిందని పోలీస్ సమాధానిమిచ్చిన ఆ యువకుడు సంతృప్తి చెందలేదు. ప్రజలు కూడా కొందరు ఎమర్జిన్సీ పరిస్థితుల్లో హెల్మెట్ లేకుండా బయటికొస్తారు. వారిని మీరు ఫోటోలు తీసి.. ఫైన్లు వేయడం లేదా ? అంటూ నిలదీశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.