కొత్తగా 13.36 లక్షల ఉద్యోగాలు

ఒక్క జనవరి నెలలోనే 13.36 మంది కొత్తగా ఉద్యోగాల్లో చేరారు. వీరంతా.. ఈపీఎఫ్‌ఓలో నమోదు చేసుకున్నారు. కరోనా మహమ్మారి ప్రభావం ఉన్నప్పటికీ ఈ ఆర్థిక సంవత్సరం తొలి పది నెలల కాలంలో కొత్తగా 62.49 లక్షల మంది ఈపీఎఫ్‌ఓలో చేరారు. క్రితం ఏడాది జనవరితో పోలిస్తే 27.79 శాతం వృద్ధి నమోదైంది. గత ఏడాది డిసెంబరుతో పోల్చినా 24 శాతం మంది అధిక చందాదారులు ఈపీఎఫ్‌ఓలో నమోదు చేసుకున్నారు.


జనవరిలో కొత్తగా చేరిన 13.36 లక్షల మందిలో 8.20 లక్షల మంది కొత్తవారు కాగా.. మిగిలిన 5.16 లక్షల మంది ఉద్యోగాలు మారినవారు లేదా వైదొలిగి తిరిగి చేరినవారు.  ఈపీఎఫ్‌ఓ గణాంకాల ప్రకారం.. ఉపాధి కల్పనలో మహారాష్ట్ర, హరియాణా, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి.