రామ్.. మాస్.. మాస్.. ఊరమాస్ !
ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రేమకథలకు సరిగ్గా సరిపోతాడు. ‘ఇస్మార్ట్ శంకర్’ కంటే ముందు ఆయన ఖాతాలో ఉన్నవన్నీ హిట్స్ అన్నీ ప్రేమకథలే. ‘ఇస్మార్ట్ శంకర్’తో రామ్ లో అసలు సిసలు మాస్ యాంగిల్ ని బయటికి తీశాడు పూరి జగన్నాథ్. ఎంతలా అంటే.. ? పూరి ఏ సినిమా చేసినా.. ఆయన మార్క్ లోకి హీరో వస్తాడు. కానీ ఇస్మార్ట్ శంకర్ విషయంలో మాత్రం రివర్స్ అయింది. రామ్ ఎనర్జి అందుకోవడానికే పూరి కిందా మీదా పడినట్టు అనిపించింది. ఒక్కమాటలో చెప్పాలంటే.. పూనకం వచ్చినట్టు నటించారు. ఇస్మార్ట్ హిట్ తర్వాత రాజ్ మాస్.. మాస్ జపం చేస్తున్నారు.
ఇందులో భాగంగానే ఆయన తదుపరి సినిమా తమిళ దర్శకుడు లింగుస్వామితో చేస్తున్నాడు. రామ్ కి జంటగ కృతి శెట్టి నటిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ఊరమాస్ దర్శకుడు బోయపాటి దర్శకత్వంలో రామ్ సినిమా ఉండనుందని సమాచారమ్. ఈ మధ్యే రామ్‌కి – బోయపాటిరామ్‌కి – బోయపాటి కథ చెప్పాడట. రామ్ కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. బోయపాటి శ్రీను – ప్రస్తుతం బాలకృష్ణతో ఓ సినిమా చేస్తున్నారు. అది పూర్తికాగానే రామ్ సినిమాపై ఫోకస్ పెట్టనున్నాడు బోయపాటి. చూస్తుంటే… రామ్.. మాస్.. మాస్.. ఊరమాస్ సినిమాలపై దృష్టి పెట్టినట్టున్నాడు.