వరల్డ్‌ సిరీస్‌ను గెలిచిన ఇండియా లెజెండ్స్

 రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌ను భారత్‌ లెజెండ్స్‌ గెలిచారు. ఫైనల్‌ మ్యాచ్‌లో 14 పరుగుల తేడాతో శ్రీలంక లెజెండ్స్‌ను ఓడించారు. మొదటి బ్యాటింగ్ చేసిన ఇండియన్ లెజెండ్స్ నిర్ణీత 20 ఓవర్స్ లో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. యువీ (60; 41 బంతుల్లో 4×4, 4×6), యూసుఫ్‌ పఠాన్‌ (62 నాటౌట్‌; 36 బంతుల్లో 4×4, 5×6) చేలరేగి ఆడారు. సచిన్‌ (30: 23 బంతుల్లో 4X5) క్లాస్ ఆటతో ఆకట్టుకున్నాడు.‌

182 పరుగుల లక్ష్యంతో బరిలోకి శ్రీలంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 167 పరుగులే చేసింది. ఆ జట్టులో సనత్‌ జయసూర్య (43) టాప్‌ స్కోరర్‌. జయసింఘే(43), వీరరత్నే(38) రాణించారు. మిగతా బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేయడంతో శ్రీలంక ఓటమి చవిచూసింది. భారత బౌలర్లు యూసఫ్‌ పఠాన్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌ చెరో రెండు వికెట్లు, మన్‌ప్రీత్‌ గోనీ, మునాఫ్‌ పటేల్‌ చెరో వికెట్‌ తీసి భారత్‌ విజయంలో కీలకపాత్ర పోషించారు.

ఇక వరల్డ్ సిరీస్ గెలిచి వచ్చిన ఇండియన్ లెజెండ్స్ కుహోటల్‌ సిబ్బంది ఘన విజయం సాధించింది. యువీకి హోటల్‌లోకి ప్రవేశిస్తుండగా సిబ్బంది రెండు వైపులా నిల్చొని వంట సామగ్రి అయిన గరిటెలను పైకెత్తి స్వాగతం పలుకుతున్నట్లు పోజిచ్చారు. దానికి హిందీ బాహుబలి పాటను బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌గా సెట్‌చేశారు. దాంతో యువీ సైతం ఆనందంతో స్టెప్పులేసుకుంటూ లోపలికి వెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియోని యూవీ తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేశారు. ఇప్పుడీ..ఈ వీడియో వైరల్ అవుతోంది