పింఛనుదారులకు ఆ తిప్పలు పోయినట్టే.. !
ప్రతి నెల పింఛన్ పొందేవారుఆధార్ కార్డులు, వేలిముద్రలకు సంబంధించి తాము పలు ఇబ్బందులు పడుతున్నారు. వృధాప్యం నేపథ్యంలో వేలి ముద్రలు సరిగ్గా రావడం లేదు. దీంతో పింఛన్ తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. వేలిముద్రలు పడకుంటే పింఛన్ ఇవ్వరేమోననే భయంలో వృద్దులు ఉన్నారు. ఇకపై ఆ భయం అవసరం లేదు. పింఛనుదారులు తమ పింఛన్లు పొందేందుకు సమర్పించే డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ‘జీవన్ ప్రమాణ్’కు ఆధార్ ఉండాలన్న నిబంధనని తాజాగా కేంద్రం సడలించింది.
ప్రభుత్వ కార్యాలయాల నుంచి పెన్షనర్లకు పంపే ‘యాప్’ సందేశాలకు, హాజరు నిర్వహణకు కూడా ఆధార్ పరిశీలన తప్పనిసరి కాకుండా, స్వచ్ఛంద వ్యవహారంగా ఉంటుంది. ప్రతినెలా పింఛన్లు పొందడంలో ఆధార్ కార్డులు, వేలిముద్రలకు సంబంధించి తాము పలు ఇబ్బందులు పడుతున్నామని పెన్షనర్ల నుంచి ప్రభుత్వానికి ఫిర్యాదులు పెద్దసంఖ్యలో వెళ్లడంతో ఈ నిబంధన సవరించారు. ఇకపై వేలి ముద్ర వేయకుండానే పింఛన్ తీసుకోవచ్చు.