మన ‘జెర్సీ’ కొట్టేసింది.. నేషనల్ అవార్డ్ !
జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా నాని ‘జెర్సీ’ ఎంపికైంది. 67వ జాతీయ చలన చిత్ర అవార్డులను తాజాగా కేంద్రం ప్రకటించింది. ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించింది. జాతీయ ఉత్తమ తెలుగు సినిమాగా జెర్సీ. తెలుగులో పాపులర్ చిత్రం మహర్షి సినిమా అవార్డ్ సొంతం చేసుకుంది. ఉత్తమ ఎడిటింగ్ విభాగంలో ‘జెర్సీ’ చిత్రానికి ఎడిటర్‌గా వ్యవహరించిన నవీన్ నూలి అవార్డు దక్కించుకున్నారు.
జాతీయ ఉత్తమ నటిగా కంగనా రనౌత్ (మణికర్ణిక) నిలిచింది. ఉత్తమ జాతీయ నటులుగా ధనుష్ (అసురన్), మనోజ్ భాజ్ పాయ్(భోంస్లే) అవార్డులను దక్కించుకున్నారు. ఇక, ఉత్తమ సినిమాటోగ్రఫీ ‘జల్లికట్టు’ (మలయాళం) చిత్రం దక్కించుకుంది. ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్(మేల్) అవార్డు బి ప్రాక్ కు దక్కింది. హిందీ సినిమా “కేసరి” లోని “తేరి మిట్టి”పాటకు బి ప్రాక్ కు ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ అవార్డు దక్కింది. ఉత్తమ హిందీ చిత్రంగా దివంగత సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ప్రధానపాత్రలో నటించిన “చిచోరే”నిలిచింది.