Rc15 అప్ డేట్ వచ్చేస్తోంది

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు జోరు మీదున్నారు. #Rc15 యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు. ప్రస్తుతం #Rc15 యాష్ ట్యాగ్ ట్రెండింగ్ టాప్ లో కొనసాగుతోంది. గ్రేట్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో #Rc15 తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చేసింది.ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించనున్నారు.

అయితే త్వరలోనే #Rc15 అప్ డేట్ రాబోతుందని మెగా ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే.. ఈ నెల 27న రామ్ బర్త్ డే కానుకగా #Rc15 అప్ డేట్ ఇస్తారని చెబుతున్నారు. ఇప్పటికే హీరోయిన్ ఫిక్సయింది. హాలీవుడ్ హీరోయిన్ ని తీసుకున్నారని చెబుతున్నారు. 27న హీరోయిన్ ని కూడా ప్రకటిస్తారని తెలుస్తోంది.

చరణ్ బర్త్ డే కానుకగా 27న ఆర్ఆర్ఆర్ నుంచి అల్లూరి సీతారామరాజు (రామ్ చరణ్) కొత్త పోస్టర్ రాబోతున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు ‘ఆచార్య’ సినిమా నుంచి రామ్ చరణ్ ఫస్ట్  లుక్ రానుంది. కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా ‘ఆచార్య’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.

ఇందులో రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. సిద్ధ పాత్రలో చరణ్ కనిపించనున్నారు. చరణ్ కనిపించేది 30 నిమిషాలే అయినా.. అద్భుతంగా ఉంటుందని తెలుస్తోంది. మొత్తానికి.. చరణ్ బర్త్ డే కానుకగా ఈ నెల 27న మెగా అభిమానులకి ట్రిపుల్ ట్రీట్ అందనుంది.