లాక్‌డౌన్’పై క్లారిటీ ఇచ్చిన TS ప్రభుత్వం !
తెలంగాణలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. కొత్త కేసులు, మరణాల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయింది. మరోసారి లాక్‌డౌన్ విధించే ఆలోచన చేస్తోంది అనే ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు, కథనాలు వెలుస్తున్నాయ్.
ఈ ప్రచారంపై తెలంగాణ హోం మంత్రి, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ స్పందించారు. తెలంగాణలో మరోసారి లాక్‌డౌన్ విధించే అవకాశం లేదు. నైట్ కర్ఫ్యూ విధించే ఛాన్స్ కూడా లేదని తెలిపారు.
మరోవైపు, ప్రస్తుత పరిస్థితులపై సీఎం కేసీఆర్ సమీక్ష చేస్తున్నారు. రాష్ట్రంలో పూర్తి లాక్‌డౌన్ విధించకున్నా.. కొన్నింటిపై ఆంక్షలు విధించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. వీకెండ్స్ లో లాక్‌డౌన్, థియేటర్స్, క్లబ్ లు, బార్ లు, షాపింగ్ మాల్స్ పై ఆంక్షలు విధించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
పాఠశాలలు, కాలేజీల్లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వాటిని మూసివేసేందుకు టీ ప్రభుత్వం రెడీ అయింది. దీనిపై రేపు ప్రకటన రావొచ్చని చెబుతున్నారు. ఇప్పటికే 1 నుంచి 8వ తరగతి విద్యార్థులని పై తరగతులకి ప్రమోట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు కొనసాగించేలా అనుమతి ఇవ్వనున్నట్లు సమాచారం.