‘రంగ్ దే’ మేకింగ్ వీడియో.. చూశారా ?

వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్-కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం ‘రంగ్ దే’. ఈ వారమే (మార్చి 26) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రచారంలో బిజీగా ఉంది చిత్రబృందం. ఇందులో భాగంగా తాజాగా ఓ మేకింగ్‌ వీడియోను విడుదల చేశారు.

కొన్ని మేకింగ్‌ సన్నివేశాల్లో నరేష్‌, నితిన్‌, కీర్తిల మధ్య కనిపించిన దృశ్యాలు ఫన్నీగా ఉన్నాయి. ఇక రంగ్ దే ట్రైలర్ ని చూస్తే సినిమా ఫన్ రైడ్ లా ఉండబోతుందని అర్థమైంది. రెయిన్ బోలో ఉండే అన్నీ రంగులు సినిమాలో ఉంటాయని  చిత్రబృందం చెబుతోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మితమైన ఈ సినిమాకి సూర్యదేవర నాగవంశీ నిర్మాత. జాతీయ అవార్డు విన్నర్ నవీన్‌ నూలి ఎడిటర్‌.