రివ్యూ : ఆఫీసర్
రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో మళ్లీ నాగార్జున సినిమా అనగానే ‘శివ’ రేంజ్ సినిమా అయి ఉంటుందని ప్రేక్షకులు ఫిక్సయ్యారు. ‘ఆఫీసర్’ కోసం ‘శివ’ గ్యాంగ్ రంగంలోకి దిగిందని చెప్పుకొన్నారు. నాగ్ కూడా ఇన్నాళ్లుకు వర్మ ‘శివ’ని మించిన కథ చెప్పాడు. మరోసారి దున్నేయబోతున్నాం. బ్లాక్ బస్టర్ హిట్ ఖాయం అన్నట్టుగా ధీమాని వ్యక్తం చేశారు. దీంతో ‘ఆఫీసర్’ కోసం ప్రేక్షకులు, ఇండస్ట్రీ ఆసక్తిగా ఎదురు చూసింది. ఇప్పుడు ‘ఆఫీసర్’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఓవర్సీస్ లో ప్రిమియర్ షోస్ పడిపోయాయి. మరీ.. ఆఫీసర్ ప్రేక్షకులని ఏ మేరకు మెప్పించాడు తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !
తెలుగు రాష్ట్రాలో ‘ఆఫీసర్’ విడుదలకి ఇంకాస్త సమయం ఉంది. కాబట్టి ఇప్పుడే ఆఫీసర్ కథని చెప్పడం లేదు. ఐతే, సినిమాపై విపిస్తున్న టాక్ ని మాత్రం మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాం. రాంగోపాల్ వర్మ టేకింగ్, నాగార్జున యాక్టింగ్’కు ప్రశంసలు కురుస్తున్నాయి. ఇంట్రడక్షన్ సీన్, ఇంటర్వెల్ సీన్ లలో మునుపతి వర్మ కనిపించాడు. అదే సమయంలో ‘ఆఫీసర్ ‘ విషయంలో వర్మ పైత్యాన్ని చూపించాడని చెప్పుకొంటున్నారు.
సినిమా ప్రారంభమైన సమయంలో వర్మ కెమెరా యాంగిల్స్ అద్భుతంగా అనిపించాయి. ఆ తర్వాత మాత్రం వర్మ కెమెరా యాంగిల్స్ చిరాక్ తెప్పించేలా ఉన్నాయని చెప్పుకొంటున్నారు. దీనికితోడు సౌండ్ ఎఫెక్ట్స్ తలనొప్పిని తెప్పించేలా ఉన్నాయి. ఫస్టాఫ్, సెకాంఢాఫ్ లోనూ స్లో నేరేషన్ ప్రేక్షకుడిని బాగా ఇబ్బంది పెట్టింది. గుడ్దిలో మెల్ల అన్నట్టుగా ఈ మధ్య వచ్చిన వర్మ సినిమాల్లో ‘ఆఫీసర్ ‘ కాస్త బెటరని చెప్పుకొంటున్నారు. మొత్తానికి ఆఫీసర్ పై మిక్సిడ్ టాక్ నడుస్తోంది.