సూర్య లెక్కలు తేలాయ్.. లాస్ ఎంతో తెలుసా ?
స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ ప్రేక్షకుల ముందుకొచ్చి 25రోజులు పూర్తి చేసుకొంది. మొదటి ఆటతోనే సూర్యపై మిక్సిడ్ టాక్ వినిపించింది. బన్నీ సినిమాలకు టాక్ తో పనిలేదు. సరైనోడు, డీజే సినిమాలు మిక్సిడ్ టాక్ తో మొదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. సూర్య విషయంలోనూ అదే జరుగుతుందని ఊహించారు. కానీ, అలా జరగలేదు. ఫస్ట్ వీక్ తర్వాత సూర్య కలెక్షన్స్ భారీగా తగ్గాయి. ‘మహానటి’ రాకతో సూర్య పనైపోయింది.
సూర్య మీద రూ. 76కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇప్పటి వరకు సూర్య ప్రపంచ వ్యాప్తంగా రూ. 55కోట్లని మాత్రమే రాబట్టాడు. ఈ లెక్కన రూ. 22కోట్ల లాస్ ని మూటగట్టుకొన్నాడు సూర్య. ఐతే, సినిమాలో బన్నీ నటనకు ప్రశంసల జల్లు కురిసింది. దర్శకుడు వంశీ పైడిపల్లికి ఇదే తొలి చిత్రం. దీంతో ఆయన సెకాంఢాఫ్ ని సరిగ్గా డీల్ చేయలేకపోయాడు. లేదంటే సూర్య బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచేదే. మరోసారి మెగా ఫ్యాన్స్ కాలరెగరేసేవారే.. !