మాస్క్ లేకుంటే జరిమానా.. నెల రోజుల్లోనే రూ.4కోట్లు వసూలు !
దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యాయ్. కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. మాస్క్ లేకుండా బయట తిరిగే వ్యక్తులకు పోలీసులు, అధికారులు జరిమానా విధిస్తున్నారు.
అలా మహారాష్ట్రలో గత నెల రోజుల్లో 2లక్షల మందికి జరిమానా విధించగా రూ.4కోట్లు వసూలైనట్లు అధికార వర్గాలు తెలిపాయి. ముంబయిలోని వివిధ ప్రాంతాల్లో మాస్క్‌లు లేకుండా తిరిగే వ్యక్తులకు గత నెల రోజులుగా జరిమానా విధిస్తున్నాం. అలా 2లక్షలమందికిపైగా జరిమానా విధించగా, రూ.4కోట్లు వసూలయ్యాయి అని ముంబయి పోలీస్ అధికారి డీసీసీఎస్ చైతన్య తెలిపారు.
వసూలైన మొత్తంలో 50శాతం బహృన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్‌కు వెళ్లనుంది. మిగిలిన మొత్తాన్ని పోలీస్ సంక్షేమ నిధికి జమ చేస్తారు. ఇక కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ మాస్క్‌లు ధరించడంతో పాటు, చేతులను తరచూ సబ్బుతో శుభ్రం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.