విద్యా సంస్థలు బంద్.. థియేటర్స్ ఓపెన్.. ఇదేం న్యాయం ?

కరోనా మళ్లీ కోరలు చాస్తోంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయింది. విద్యాసంస్థలని తాత్కాలికంగా మూసేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అన్నీ రకాల పరీక్షలని రద్దు చేసింది. ఇటీవల స్కూల్స్, కాలేజీల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా బారినపడిన నేపథ్యంలో.. ప్రభుత్వం అర్జెంట్ గా ఈ నిర్ణయం తీసుకుంది. ఇది మంచి నిర్ణయమే. కానీ విద్యాసంస్థలని మూసేసిన ఇదే ప్రభుత్వం.. థియేటర్స్ మాత్రం మూసేయలేం అని గర్వంగా ప్రకటించింది. 


ఎందుకంటే ? ఇప్పటికే తెలుగు సినిమా పరిశ్రమ బాగా నష్టపోయింది. మళ్లీ థియేటర్స్ బంద్ అంటే.. కష్టం అన్నారు మంత్రి తలసాని. అయితే స్కూల్స్ , కాలేజీ ల కంటే థియేటర్స్ ద్వారానే కరోనా వ్యాప్తి ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. అలాంటి వాటిని వదిలేసి.. విద్యాసంస్థలని మాత్రం మూసేయడం గమనార్హం. బహుశా.. విద్యా సంస్థల నుంచి ప్రభుత్వానికి రెగ్యూలర్ ఇన్ కమ్ రాదనేమో.. ! మరోవైపు తెలంగాణలో విద్యా సంస్థలని మూసేయడంపై ఉపాద్యాయలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పలుచోట్ల ఆందోళనలు చేస్తున్నారు. థియేటర్స్, బార్లని మూసేయని ప్రభుత్వం విద్యాసంస్థలని మూసేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.