‘రంగ్ దే.. ఇలా సాగుతోంది’
పెళ్లి తర్వాత ఎదురయ్యే సమస్యల్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా పరిష్కరించుకుంటారు. నితిన్-కీర్తి సురేష్ పెళ్లి తర్వాత ఎదురైన సమస్యలని ఎలా పరిష్కరించుకున్నారు తెలియాలంటే.. ‘రంగ్ దే’ సినిమా చూడాల్సిందే అంటున్నారు దర్శకుడు వెంకీ అట్లూరి. ఆయన దర్శకత్వంలో నితిన్-కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రమిది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించింది. రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న వెంకీ అట్లూరి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
భావోద్వేగానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలనే ఆలోచన నుంచి పుట్టింది ఈ కథ. పక్కపక్క ఇళ్లలో ఉండే అమ్మాయి, అబ్బాయి పెళ్లి చేసుకోవాల్సి వస్తే వాళ్ల పరిస్థితి ఏంటనే లైన్ ఆధారంగా తీసుకుని కథ రాసుకున్నాను. ఈ చిత్రం నవ్వులు పంచుతూనే ఎమోషన్‌గా సాగుతుంది. ఒక్కో రంగు ఒక్కో భావోద్వేగాన్ని సూచిస్తుంది. అందుకే ‘రంగ్ దే’ అనే పేరు పెట్టాం. ద్వితీయార్ధంలో సుమారు 40 నిమిషాలు మనసుని హత్తుకునే సన్నివేశాలుంటాయి. అయితే అవి డ్రామాగా కాకుండా చాలా సహజంగా సాగుతూ మనకి కనెక్ట్ అవుతాయి అని చెప్పుకొచ్చారు. ఇక ఇప్పటికే ఓవర్సీస్ లో రంగ్ దే బొమ్మపడిపోయింది. అక్కడి నుంచి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.