ఉద్యోగులు, నిరుద్యోగులకూ.. గుడ్ న్యూస్ చెప్పిన సీఎం కేసీఆర్ !
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆఖరి రోజున.. సభలో సీఎం కేసీఆర్ అద్భుతమైన ప్రసంగం చేశారు. ప్రతి అంశాన్ని టచ్ చేశారు. క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో ఎట్టిపరిస్థితుల్లోనూ మళ్లీ లాక్ డౌన్ ఉండదని క్లారిటీ ఇచ్చారు. ఉద్యోగులు, నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే ఆర్టీసీ ఉద్యోగులకు కూడా వేతనాల పెంపు ఉంటుందని తెలిపారు.
నిరుద్యోగులకు కూడా సీఎం కేసీఆర్ తీపికబురు చెప్పారు. కరోనా వ్యాప్తి కారణంగా నిరుద్యోగ భృతి చెల్లించలేకపోయామని.. త్వరలోనే నిరుద్యోగులను గుర్తించే ప్రక్రియకు శ్రీకారం చుడతామని అన్నారు. కరోనా వ్యాప్తి అదుపులోకి వచ్చాక నిరుద్యోగ భృతి అందజేస్తామని తెలిపారు. పంచాయతీ కార్యదర్శులకు రెగ్యులర్ కార్యదర్శులకు ఇచ్చే వేతనం ఇస్తామని చెప్పారు. త్వరలోనే పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని, పోడు భూములు సాగు చేసుకుంటున్నవారికీ రైతుబంధు ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. మొత్తానికి.. బడ్జెట్ సమావేశాల్లో ఆఖరిరోజున సీఎం కేసీఆర్ నుంచి అన్నీ తీపి కబుర్లే వచ్చాయి.