బర్త్ డే గిఫ్ట్ : ‘ఆచార్య’లో రామ్ చరణ్ ఫస్ట్ లుక్ వచ్చేసింది

ఆచార్య ‘సిద్ధ’ వచ్చేశాడు. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడుగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆచార్య’. ఇందులో చిరు తనయుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘సిద్ధ’ అనే కీలక పాత్రలో నటిస్తున్నారు. దాదాపు 30 నిమిషాల నివిడి గల పాత్రలో చరణ్ కనిపించనున్నారు. చరణ్ బర్త్ డే కానుకగా తాజాగా సిద్ధ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఆచార్య ‘సిద్ధ’ అంటూ మెగాస్టార్ పోస్టర్ ని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.

ఈ పోస్టర్ ని చూస్తుంటే.. చిరు, చరణ్ ఇద్దరు నక్సలైట్స్ గా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఇది ఫ్లాష్ బ్యాక్ ఏపీసోడ్ మాత్రమేనని సమాచారమ్. చిరుకి జంటగా కాజల్ నటిస్తున్నారు. రామ్ చరణ్ పక్కన నటించే హీరోయిన్ ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. రష్మిక మందన పేరు గట్టిగా వినిపిస్తోంది. ఇక రామ్ చరణ్ బర్త్ డే కానుకగా అభిమానులకి ట్రిపుల్ ట్రీట్ అందనుంది. ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ నుంచి పోస్టర్, ఆచార్య నుంచి ఫస్ట్ లుక్ వచ్చేసింది. ఇక #RC15 అప్ డేట్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఆచార్య “సిద్ధ ” …#HappyBirthdayRamcharan#Siddha #Acharya#AcharyaOnMay13 pic.twitter.com/Nk34oWYKRI— Chiranjeevi Konidela (@KChiruTweets) March 27, 2021