రాజకీయాల్లోకి శృంగార తార

సినీ నటి, శృంగార తార షకీలా రాజకీయ ప్రవేశం చేశారు. బుధవారం ఆమె కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆ పార్టీ తమిళనాడుకు చెందిన మానవ హక్కుల విభాగంలో షకీలా పని చేయనున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి తరుపున షకీలా ప్రచారం చేయనున్నారు. ఒకప్పుడు షకీలా సినిమా వస్తుందంటే.. స్టార్ హీరోల సినిమాలు సైతం సైడైపోయాయ్. ఇప్పుడు.. రాజకీయాల్లోనూ షకీలా ఆ రేంజ్ ని చూపిస్తారేమో చూడాలి.

దక్షిణాది సినీ ప్రపంచంలో అతి తక్కువ కాలంలోనే వందలాది చిత్రాల్లో నటించిన షకీలా.. శృంగార తారగా ప్రేక్షకుల్లో ఆదరణ పొందారు. దక్షిణాదిలో మరే సినీ తారకు రానంత క్రేజ్‌ను ఆమె సొంతం చేసుకున్నారు. మలయాళం, తమిళ, తెలుగు, హిందీ భాషల్లో దాదాపు 200కి పైగా సినిమాల్లో నటించారు. గతేడాది ఆమె జీవితకథ ఆధారంగా బయోపిక్‌ కూడా విడుదలైంది. ఆమె పాత్రలో బాలీవుడ్‌ నటి రిచా చద్దా నటించారు.