డేంజర్ : దేశంలో కరోనా గత్తర

దేశంలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. సెకండ్ వేవ్ మొదలైంది. అది భయంకరంగా మారుతోంది. కొత్త కేసులు, మరణాలు రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 62,258 కొత్త కేసులు నమోదయ్యాయ్. మరో 291మంది ప్రాణాలు కోల్పోయారు. 

ప్రస్తుతం దేశంలో 4,52,647 క్రియాశీల కేసులుండగా..ఆ రేటు 3.55 శాతానికి పెరిగింది. ఇక, నిన్న ఒక్కరోజే 30,386 మంది వైరస్‌ నుంచి బయటపడ్డారు. ఇప్పటివరకు 1.12 కోట్ల మంది వైరస్‌ను జయించగా..రికవరీ రేటు 95.09 శాతానికి పడిపోయింది. మహారాష్ట్రల్లో వైరస్ తీవ్రత అధికంగా ఉంది. సెలబ్రిటీలు వరుసగా కరోనా బారినపడుతున్నారు. నిన్న బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్.. ఇవాళ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కరోనా బారినపడ్డారు.

ఇక తెలంగాణలోనూ కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 495 కొత్త కేసులు నమోదయ్యాయ్. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 3,05,804కి చేరింది. నిన్న కొవిడ్‌తో ఇద్దరు మృతిచెందారు. దీంతో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 1685కి చేరింది. ప్రస్తుతం 4,241 కొవిడ్‌ యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.