‘ఆఫీసర్’కు 400 వెనక నాగ్ !

నాగార్జున ‘ఆఫీసర్’గా ప్రేక్షకుల ముందుకొచ్చేశాడు. ఐతే, స్టార్ హీరోల సినిమా రేంజ్ లో ‘ఆఫీసర్’ విడుదల కాలేదు. తెలుగు రాష్ట్రాల్లో స్టార్ హీరోల సినిమాలు కనీసం 600 థియేటర్లలో విడుదలవుతున్నాయి. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన రంగస్థలం, భరత్ అను నేను, నా పేరు సూర్య, మహానటి సినిమాలు భారీ ఎత్తున విడుదలయ్యాయి. నాగ్ ‘ఆఫీసర్’కు మాత్రం 350 థియేటర్స్ మాత్రమే పరితమైందని చెబుతున్నారు.

ఈ మాత్రం థియేటర్స్ దక్కడం వెనక కూడా నాగార్జున కృషి ఉందట. వర్మపై కోపంతో డిస్ట్రిబ్యూటర్లు, పలువురు నిర్మాతలు ఈ చిత్రాన్ని విడుదల కానిచ్చేది లేదని పట్టుబట్టారు. ఆ మద్య పవన్‌పై వర్మ చేసిన విమర్శలు, శ్రీరెడ్డితో పవన్‌పై విమర్శలు చేయించడం వంటి విషయాలని ఇండస్ట్రీ మరచిపోలేదు. ఈ ఎఫెక్ట్ ఆఫీసర్ పడింది. ఐతే, నాగ్ రంగంలోకి దిగి పరిస్థితి కాస్త చక్కదిద్దారు. ‘ఆఫీసర్’ ఓ 400 థియేటర్స్ దక్కేలా చేశాడు.

ఇక, ఆఫీసర్ పబ్లిక్ టాక్ బయటికొచ్చింది. సినిమాపై మిక్సిడ్ టాక్ వినిపిస్తోంది. వర్మ ప్లాపు సినిమాల లిస్టులో ఆఫీసర్ కూడా చేరిపోవడం ఖాయమని చెబుతున్నారు. నాగ్ నుంచి మాత్రం తప్పు జరగలేదు. ఆయన అద్భుత నటనతో ఆకట్టుకొన్నాడని చెప్పుకొంటున్నారు.