RC15 అప్ డేట్ తీవ్రంగా నిరాశపరిచింది !

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం #ఆర్ఆర్ఆర్ తో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత గ్రేట్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో చరణ్ (#RC15) సినిమా ఉండనుంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చేసింది. అయితే రామ్ చరణ్ బర్త్ డే కానుకగా #RC15 అప్ డేటు వస్తుందని మెగా అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. వారి అంచనాలు నిజమయ్యాయ్.

 #RC15 గురించి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్విట్ చేసింది. త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్ మొదలుకానుందని తెలిపింది. కానీ ఎలాంటి పిక్కూ, లుక్కూ లేకుండా సాదాసీదా ట్విట్ చేయడం మెగా అభిమానులని ఒకింత నిరాశపరిచిందని చెప్పవచ్చు. చరణ్ బర్త్ డే కానుకగా #RC15 టైటిల్, హీరోయిన్, ఓ పిక్ వస్తుందని అభిమానులు ఆశపడ్డారు. కానీ చాలా చప్పగా #RC15 అప్ డేటు ఇచ్చేశారు దిల్ రాజు. బహుశా.. ఈ సాయంత్రంలోగా సడన్ సప్రైజ్ ఏమైనా ప్లాన్ చేశారేమో చూడాలి.

ఇక చరణ్ బర్త్ డే కానుకగా ఇప్పటికే మెగా అభిమానులకు డబుల్ ట్రీట్ అందింది. శుక్రవారమే ఆర్ ఆర్ ఆర్ నుంచి అల్లూరి సీతారామరాజు (చరణ్) కొత్త పోస్టర్ ని విడుదల చేశారు. ఇందులో అల్లూరి ఉగ్రరూపం చూపించారు. ఇక ఈ ఉదయం ఆచార్య ‘సిద్ధ’ లుక్ ని రిలీజ్ చేశారు. ధర్మానికి ధైర్యం తోడైతే అంటూ.. దర్శకుడు కొరటాల ఆచార్యలో రామ్ చరణ్ పాత్ర గురించి చెప్పే ప్రయత్నం చేశారు. ఆచార్య ‘సిద్ధ’ అంటూ  చరణ్ లుక్ ని మెగాస్టార్ తన ట్విట్టర్ ఖాతాలో షేఋ చేశారు. 

Happy Birthday Megapower Star @AlwaysRamCharan !!

We can’t wait to start working with you on our prestigious #RC15. See you soon on the sets !!#HBDRamCharan pic.twitter.com/NA3HkqvtYu— Sri Venkateswara Creations (@SVC_official) March 27, 2021