మహేష్ పిల్లలు.. ఇలా !

సూపర్ స్టార్ మహేష్ బాబు పిల్లలు గౌతమ్, సితార ఇద్దరూ.. సోషల్ మీడియాలో స్టార్లే. వీరిద్దరి ఫోటోలు, వీడియోలు తరచూ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయ్. గౌతమ్ కనిపించేది తక్కువే. తండ్రి మహేష్ తోనే గౌతమ్ కనిపిస్తుంటారు. కానీ సితార అలా.. కాదు. ఒంటరిగానే దూసుకెళ్తూ ఉంటుంది. ఆమె ఫోటోలు, వీడియోలకు ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉన్నారంటే.. సితార అల్లరిని అర్థం చేసుకోవచ్చు. 


తాజాగా గౌతమ్, సితార స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహేష్ ఫ్యాన్స్ గ్రూపులలో ఈ పిక్ చక్కర్లు కొడుతోంది. ఇందులో అన్నయ్య  గౌతమ్ ని సితార డ్యామినేట్ చేసింది. క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంటోంది. అన్నట్టు.. ఈ పిక్ తీసిన వ్యక్తికి కూడా క్రెడిట్ ఇవ్వాలి. బహుశా.. అది మహేష్ లేదా నమ్రత అయి ఉంటారేమో.. ! ఇక ‘వన్-నేనొక్కడినే’ సినిమాతో తెరకు పరిచయం అయ్యారు గౌతమ్. ఇక టీనేజ్ హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడని మహేష్ అభిమానులు ఎదురు చూస్తున్నారు.


ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. మహేష్ జంటగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. బ్యాంక్ దోపిడి నేపథ్యంలో ఈ సినిమా ఉండనుందని చెబుతున్నారు. ఈ సినిమా కోసం మహేష్ సరికొత్త లుక్ లోకి మారిపోయిన సంగతి తెలిసిందే.