ఫస్ట్ వీక్.. బాక్సాఫీస్ రిపోర్ట్ !
గత వారం మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయ్. నితిన్ ‘రంగ్ దే’, రానా ‘అరణ్య’ ఒకేరోజు (మార్చి26) థియేటర్స్ లోకి వచ్చేశాయ్. ఒకరోజు ఆలస్యంగా (మార్చి 27) ‘తెల్లారితే గురువారం’ రిలీజైంది. అయితే ఈ మూడు చిత్రాల్లో రంగ్ దే మాత్రమే పాజిటివ్ టాక్ సొంత చేసుకుంది. మంచి వసూళ్లు సాధిస్తోంది. ఫస్ట్ వీకెండ్ ఈ సినిమాకు ఏపీ, నైజాంలో 10 కోట్ల 35 లక్షల రూపాయల షేర్ వచ్చింది. వరల్డ్ వైడ్ చూసుకుంటే.. రూ. 13 కోట్ల రూపాయలు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 11 కోట్ల రూపాయలు రావాలి.
రానా నటించిన అరణ్య సినిమా డిజాస్టర్ దిశగా దూసుకుపోతోంది. విడుదలైన మొదటి రోజే నెగెటివ్ టాక్ తెచ్చుకున్న అరణ్య.. తొలి వీకెండ్ లో రెండున్నర కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. మరోవైపు ‘తెల్లవారితే గురువారం’ అనే సినిమా డిజాస్టర్ గా తేలిపోయింది. ఈ సినిమా ఆడిన థియేటర్ల కంటే.. రద్దయిన స్క్రీన్సే ఎక్కువగా ఉన్నాయి. మొత్తంగా.. మూడు సినిమాల్లో రంగ్ దే ఒక్కటే సేఫ్. మిగిలిన రెండు సినిమాలు అరణ్య, తెల్లారితే గురువారం డిజాస్టర్లు.