రస్మిక చేతికి ఉంగరం.. విజయ్ పంపించాడా ?

హీరోయిన్ రష్మిక మందన.. తన చేతి ఉంగరాన్ని చూసుకోని మురిసిపోతుంది. దాన్ని ఫోటో తీసి తన ఇస్టా గ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ‘ఇది నాకు ఎవరు పంపారో తెలుసు. దీన్ని నేను అందుకున్నా. నేను మీ రహస్య సందేశాన్ని చదివాను. నాకిది సరిగ్గా సరిపోయింది. నేను దీన్ని ప్రేమిస్తున్నాను’ అంటూ కామెంట్ పెట్టింది.


దీంతో రస్మిక షేర్ చేసిన ఫోటో, ఆమె పెట్టిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఉంగరం కచ్చితంగా రస్మిక ప్రియుడు పంపించాడు. అతడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ కావొచ్చని కామెంట్స్ పెడుతున్నారు. ఎందుకంటే.. ? వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుందనే ప్రచారం ఉంది. గతంలో రస్మిక విజయ్ ఇంట్లో మెరిసింది. ఇటీవల ముంబైలో విజయ్ తో కలిసి పార్టీలో పాల్గొంది. ఈ నేపథ్యంలోనే రస్మిక చేతి  ఉంగరం విజయ్ పంపినదే కావొచ్చని చెప్పుకుంటున్నారు.  

రస్మిక-కార్తీ జంటగా నటించిన ‘సుల్తాన్‌’ ఏప్రిల్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం రస్మిక ‘పుష్ప’, ‘మిషన్‌మజ్ను’, ‘ఆడాళ్లు మీకు జోహార్లు’ సినిమాల్లో నటిస్తోంది.