కరోనా ఎఫెక్ట్.. ‘వకీల్ సాబ్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ క్యాన్సిల్ ?

పవర్ స్టార్ పవన్  కల్యాణ్ అభిమానులకి షాకింగ్ న్యూస్స్ ఇది. వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ క్యాన్సిల్ కానున్నట్టు సమాచారమ్. ఏప్రిల్ 9న వకీల్ సాబ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్ లో వేగం పెంచింది. మొన్ననే ట్రైలర్ ని విడుదల చేశారు. వకీల్ సాబ్ ట్రైలర్ రికార్డులని తిరగరాస్తోంది. ఈ ఆనందంలో ఏప్రిల్ 3న ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. యూసుఫ్‌గూడ పోలీస్‌ లైన్స్‌లోని స్పోర్ట్స్‌ గ్రౌండ్ ని వేదికగా ఎంచుకున్నారు.

పనులు కూడా ప్రారంభించేందుకు రెడీ అయ్యారు. ఇంతలో వకీల్ సాబ్ కు తెలంగాణ పోలీసులు షాక్ ఇచ్చారు. ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి అనుమతిని ఇచ్చేది లేదంటున్నారని తెలిసింది. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అనుమతులు ఇవ్వలేమని చెప్పారట. పవన్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ అంటే.. ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే. అభిమానులతో వేదిక కిక్కిరిసి పోవడం ఖాయం. వేదిక బయట కూడా ఓ జాతర జరిగినట్టు ఉంది. ప్రస్తుత టైమ్ లో అది మంచిది కాదు.. ఫంక్షన్ కి అనుమతి లేదని పోలీసులు చెప్పినట్టు తెలిసింది.