పవర్ స్టార్ విషెస్.. ఆ కిక్కే వేరబ్బా.. !

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో ఓ సినిమా చేయాలన్నది దాదాపు ప్రతి దర్శకుడి కల. అయితే ఆ పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం కోరుకునేది మాత్రం ఒకే ఒక్క దర్శకుడిని. అతడే గబ్బర్ సింగ్ డైరెక్టర్… హరీష్ శంకర్. దానికి గల కారణం కూడా అందరికీ తెలిసిందే. పవన్ కి హిట్ ఇచ్చిన దర్శకులు చాలా మందినే ఉన్నారు. కానీ.. పవన్ ఫ్యాన్స్ కి హరీష్ శంకర్ ఇచ్చినంత కిక్కు ఏ దర్శకుడు ఇవ్వలేదు. ఇవ్వడు కూడా. అప్పటి వరకు ప్లాపుల్లో ఉన్న పవన్, అప్పటికే నిరాశలో మునిగిపోయిన ఆయన ఫ్యాన్స్ కు గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు. అలాంటి ఇలాంటి హిట్ కాదు.. ఇండస్ట్రీ హిట్. పవన్ కెరీర్ లో ఎన్ని సినిమాలు తీసినా.. ఎన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టినా… గబ్బర్ సింగ్ స్థానాన్ని ఎవరు చెరిపేయలేరు. 

కడుపునిండి ఉన్నప్పుడు అన్నం పెట్టినవారు గుర్తుండకపోవచ్చు. కానీ కడుపు ఎండినప్పుడు అన్నం పెట్టినవారిని ఎప్పుడూ మరచిపోలేం. గబ్బర్ సింగ్ అంతే. పవన్ ఫ్యాన్స్ కు హరీష్ శంకర్ అంతే. అలాంటి గబ్బర్ సింగ్ కాంబో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పవన్ హరిహర వీరమల్లు, అయ్యప్పనుమ్ కోషియమ్’ తెలుగు రిమేక్ తో బిజీగా ఉన్నారు. ఇవి పూర్తికాగానే పవన్-హరీష్ కాంబోలో సినిమా మొదలు కానుంది. ఈ సినిమా కోసం పవన్ అభిమానులు, ఇండస్ట్రీ ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

ఈలోగా దర్శకుడు హరీష్ శంకర్ బర్త్ డే వచ్చేసింది. బుధవారం హరీష్ బర్త్ డేని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సన్నిహితులు, స్నేహితులు, సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తాయ్. అయితే వీటి అన్నింటిలో పవర్ స్టార్ చెప్పిన విషెస్ ప్రత్యేకంగా నిలిచాయ్. హరీష్ కు పవన్ బుకె ఇచ్చి.. విషెస్ చెప్పిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయ్. ఆ సమయంలో హరీష్ శంకర్ మొహం ఆకాశంలోని చంద్రుడు, చుక్కల వలే వెలిగిపోతుంది. పవర్ స్టార్ విషెస్.. ఆ కిక్కే వేరబ్బా అని హరీష్ మురిసిపోయినట్టుంది. అంతేగా… అంతేగా.. !!