బ్రేకింగ్ : పెన్ స్టూడియోస్ చేతికి #RRR అన్నీ రైట్స్

ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న చిత్రమిది. ఈ నేపథ్యంలో #RRR కోసం ప్రేక్షకులు భారత సినీ పరిశ్రమ ఆసక్తిగా ఎదురు చూస్తోంది. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా #RRR ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే అప్పడే ఈ సినిమా రైట్స్ హాట్  కేకుల్లా అమ్ముడుపోతున్నాయ్. 

తాజాగా ప్రముఖ #PEN Studios నార్త్ ఇండియా ఆర్ ఆర్ ఆర్ రైట్స్ అన్నింటిని కొనేసింది. ఇందులో థియేట్రికల్ రైట్స్ తో పాటు, ఎలట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా, శాటిలైట్ రైట్స్ ఉన్నాయి. భారీ రేటుకు.. ఇంకా చెప్పాలంటే నమ్మశక్యం కానీ రేటుకు.. ఈ రైట్స్ సొంతం చేసుకున్నట్టు సమాచారమ్.

ఈ చిత్రంలో కొమరంభీమ్ పాత్రలో తారక్.. ఆయనకి జంటగా హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరీస్ నటిస్తున్నారు. అల్లూరి సీతారామ రాజుగా రామ్ చరణ్, ఆయనకి జంటగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ సీత పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్నారు.

#BreakingNews… Jayantilal Gada’s #PEN Studios cracks the deal for #SSRajamouli’s hugely awaited #RRR… Rights include…
⭐ North India theatrical rights
⭐ Electronic, Digital and Satellite rights of *all* languages#RRRMovie #JrNTR #RamCharan #AjayDevgn #AliaBhatt pic.twitter.com/VwqBmEsfDY— taran adarsh (@taran_adarsh) April 1, 2021