పవన్-రానా కలిసి వచ్చేశారు !

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కథానాయకులుగా మలయాళ హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ తెలుగు రిమేక్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ మాటలు అందిస్తున్నారు. దీంతో సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయ్. ఇప్పుడీ.. ఈ సినిమా నుంచి సడెన్ స్ప్రైజ్ వచ్చేసింది. పవన్-రానా కలిసి వచ్చేశారు. ఇది ఫస్ట్ లుక్ అనుకుంటే.. పొరపాటే. ఫ్యాన్ మేడ్ పోస్టర్. కానీ అఫిషియల్ ఫస్ట్ లుక్ మాదిరిగా పక్కగా.. రిచ్ గా ఉంది. ప్రస్తుతం.. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


వకీల్ సాబ్ గా పవన్ ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా రిలీజ్ కాకముందే క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు పవన్. దీంతో పాటు ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ తెలుగు రిమేక్ ని కూడా మొదలెట్టారు. అతి త్వరలోనే హరీష్ శంకర్ సినిమా కూడా సెట్స్ మీదకు వెళ్లనుందని చెబుతున్నారు. మొత్తంగా దాదాపు 15 సినిమాలని పవన్ లైన్ లో పెట్టినట్టు సమాచారమ్. ఇది సంచలనమే. కానీ నిజం. ఇందులో పవన్ ఫుల్త్ లో చేసే సినిమాలు.. గెస్ట్ రోల్ లో మెరిసే సినిమాలు, నిర్మాతగా చేయనున్న సినిమాలు కూడా ఉన్నయట