వైరల్ : సినిమా సెట్స్’లో గొడవకి దిగిన సోహెల్ (వీడియో)

బిగ్ బాస్ తెలుగు సీజన్ లో అందరి కంటే ఎక్కువ లాభ పడింది సోహెల్ నే. డబ్బుకు డబ్బు.. పేరు పేరుకు తెచ్చుకున్నారు. పైగా మెగాస్టార్ చిరంజీవి నుంచి స్పష్టమైన హామీ తీసుకున్నారు. సోహెల్ సినిమాకు సాయం చేస్తానని చిరు మాటిచ్చిన సంగతి తెలిసిందే. ఇక బిగ్ బాస్ ఇంటి నుంచి బయటికిరాగానే సోహెల్ తొలి సినిమా ఫిక్సయింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య ఫేమ్ రూపా కొడవయూర్‌ నటిస్తోంది. అయితే ఆమె సెట్స్ లోకి అడుగుపెట్టిన తొలిరోజే.. ఏడ్చేసింది. కాదు ఏడిపించేశారు. దానికి కారణం సెట్ లో ఓ వ్యక్తితో సోహెల్ గొడవకు దిగడమే.

ఇద్దరు ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. అది కొట్టుకునే వరకు వెళ్లింది. ఈ సీన్ అంతా దగ్గరుండి చూసిన హీరోయిన్ కంటతడి పెట్టుకుంది. ఆ తర్వాతే తెలిసింది.. ఇది ఫ్రాంక్ ఫైట్ సీన్ అని. ఇక ఈ సీన్ లో సోహెల్ రెచ్చిపోయాడు. సీన్ లో మునిగిపోయాడు. అవతలి వ్యక్తి కూడా బాగా చేశాడని సోహెల్ కితాబివ్వడం.. చివరలో హీరోయిన్ ని సోహెల్ దగ్గరకు తీసుకోవడం చూడొచ్చు. ఇప్పుడీ.. ఈ సీన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.