ఇది మెగా వారం.. మెగా ఫ్యాన్స్ కి పండగే !

ఈ వారం మెగా అభిమానులకు పండగే. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ట్రైలర్ తో మొదలెట్టాడు. వకీల్ సాబ్ ట్రైలర్ ని వదిలాడు. అది రికార్డుల దుమ్ముదులిపేసింది. పవర్ స్టార్ మానియా ఏంటో మరోసారి నిరూపించింది. ఆ తర్వాత ఒక్కరోజు గ్యాప్ లోనే మెగాస్టార్ చిరంజీవి పాటతో వచ్చేశాడు. ఆచార్య నుంచి తొలి పాట #LaaheLaahe వచ్చేసింది. ఊపు ఊపేసింది. ఇక అప్పటి నుంచి మెగా సినిమాల అప్ డేట్స్ నాన్ స్టాప్ గా వచ్చేస్తున్నాయి.

ఈ వారమే వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్. ఇప్పటికే వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండింగ్ లో కొనసాగుతోంది. పవన్ కి పోటీ అన్నట్టుగా స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ రంగంలోకి దిగిపోయారు. ఈ వారమే పుష్ప అప్ డేట్స్ అంటూ.. ఓ ట్విట్ చేసింది మైత్రీ మూవీస్. ఈ నేపథ్యంలో ఈ వారం అంతా మెగా సందడి కొనసాగనుంది. మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. 

సుకుమార్-అల్లు అర్జున్ కాంబోలో హ్యాట్రిక్ చిత్రంగా పుష్ప తెరకెక్కుతోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో పుష్ప తెరకెక్కుతోంది. ఇందులో బన్నీ పుష్పరాజ్ పాత్రలో లారీ డ్రైవర్ గా కనిపించనున్నారు. ఆయన కి జంటగా రష్మిక మందన నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది.