IPL-14 ప్రారంభానికి ముందు బిగ్ షాక్
వచ్చే వారమే ఐపీఎల్14 ప్రారంభం కాబోతుంది. వచ్చే శనివారం వాంఖడేలో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తమ తొలిపోరులో తలపడనున్నాయి. ఈ రెండు జట్లతో పాటు పంజాబ్, రాజస్థాన్ సైతం ఇప్పుడు ముంబయిలోనే ఉన్నాయి. అయితే తొలిపోరు వేదిక కాబోతున్న వాంఖడే స్టేడియం సిబ్బంది కరోనా బారిన పడడం ఆందోళ కలిగిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఐపీఎల్ 14వ సీజన్ ఎలా జరగనుందో చూడాలి.
గతేడాది కూడా సరిగ్గా ఐపీఎల్ ప్రారంభానికి ముందే దేశంలో కరోనా కేసులు పెరగిన సంగతి తెలిసిందే. దీంతో మెగా ఈవెంట్‌ను 6 నెలలు వాయిదా వేశారు. చివరికి యూఏఈ వేదికగా ఐపీఎల్ 13 ని నిర్వహించారు. అప్పుడు కూడా మ్యాచ్‌లు ప్రారంభం కాకముందే పలువురు చెన్నై ఆటగాళ్లు, సిబ్బంది కరోనా బారిన పడ్డారు. తర్వాత వాళ్లు కోలుకొని టోర్నీ యథాతథంగా కొనసాగింది. ఇప్పుడు భారత్ లో రెండో దశ కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ సారి కూడా మెగా టోర్నీకి ముందు కరోనా ఆందోళన కలిగిస్తోంది.