RC16 అప్ డేటు వచ్చేస్తోంది

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం #RRRతో బిజీగా ఉన్నారు. రామ్ చరణ్ నటిస్తున్న 14వ చిత్రమిది. ఇక గ్రేట్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో #RC15 తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా సినిమాగా రానుంది. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించనున్నారు. త్వరలోనే #RC15 రెగ్యూలర్ షూటింగ్ మొదలు కానుందని ఇటీవలే దిల్ రాజు అప్ డేట్ ఇచ్చారు. తాజాగా #RC16 కూడా ఫిక్సయింది. ‘జెర్సీ’ దర్శకుడు గౌతమ్ తిన్నమూరి చెప్పిన కథకు చరణ్ ఓకే చెప్పేశారు.

ఉగాధి కానుకగా #RC16 అప్ డేటు రానుంది. ప్రస్తుతం #RC16 ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోంది. ట్రెండింగ్ టాప్ లో కొనసాగుతోంది. గౌతమ్ తిన్నమూరికి చరణ్ ఓకే చెప్పడం పట్ల మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘జెర్సీ’ సినిమాతో గౌతమ్ తిన్నమూరి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఆయన తొలి సినిమానే జాతీయ అవార్డుని గెలుచుకుంది. ప్రస్తుతం జెర్సీ హిందీ రిమేక్ తో గౌతమ్ బిజీగా ఉన్నారు. ఇందులో షాహిద్ కపూర్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత చరణ్ తో గౌతమ్ సినిమా ఉండనుంది. ఇది కూడా పాన్ ఇండియా సినిమానే అని తెలుస్తోంది. దీంతో.. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ అన్నీ పాన్ ఇండియా సినిమాలే చేయబోతున్నట్టు స్పష్టం అవుతోంది.